News

అమరావతి పై మాట తప్పి.. మడమ తిప్పిన జగన్

స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతి పై సీఎం జగన్ మాట తప్పి మడమతిప్పారని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రస్తుత ప్రభుత్వం వైఖరి సీఎం ప్రసంగం తదితరాంశాలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ తో సహా అందరీ ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేసామని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఇదే అంశానికి ఇప్పటికీ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. స్వయం ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు చేశామని ఖర్చు లేకుండానే 33 ఎకరాల భూ సమీకరణ చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రమంతటికి సంపద సృష్టి కేంద్రం అవుతుందని తెలిపారు. రాజధాని భూముల్లో ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ,సుప్రీంకోర్టు వారు తీర్పు చెప్పిన వైసీపీ నేతలు మూడు సంవత్సరాల నుంచి ఒకే పాట పాడుతున్నారని ధ్వజమెత్తారు. 2014కు ముందు అసైన్డ్ భూములు ఎవరి పేరు మీద ఉంటే వారికే పట్టాలి ఇచ్చేలా తమ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.