బీజేపీకి 40 సీట్లు రావడం కష్టం: ఆదిత్య ఠాక్రే
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. అమోల్ కృతికార్ స్థానంలో తాము విజయం సాధించామని, దీనిపై న్యాయస్థానాన్ని అడుగుతామని చెప్పారు. ఈసీ అంటే ఎన్నికల కమిషన్ కాదని, ఈజీలీ కాంప్రమైజ్డ్ అని అర్థం చెప్పారు. కాషాయ పార్టీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు.

