Home Page SliderTelangana

ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ జాప్యమనే చెప్పాలి

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ జాప్యం అంశంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి మరల ఆ ప్రస్తావనే తేకుండా ఉండిపోయింది. ఈ రెండు పార్టీలూ.. వర్గీకరణపై పదేళ్లలో ఒక్కసారి కూడా లోక్‌సభలో చర్చించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. సమస్యపై ప్రధాని వద్దకు ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లాలని కోరినా సీఎం పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పుడు ప్రధాని ఆ ప్రతిపాదన తీసుకొచ్చినందుకు కొంతమేర ఉలిక్కిపడుతున్న రెండు పార్టీ (కాంగ్రెస్, బీఆర్ఎస్)ల నాటకాలు ప్రజలకు అర్థమవుతున్నాయి.