ఇస్రోకు కొత్త ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీకాలం ఈ నెల 14న ముగియనుండడంతో కొత్త ఛైర్మన్‌ను నియమించారు. ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమించారు. ఆయన ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. నారాయణన్ ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్‌సీ)కి నేతృత్వం వహిస్తున్నారు. సంస్థలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాలలో పనిచేశారు. ఆయన ఆదిత్య-ఎల్1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగాలలో కీలక బాధ్యతలు వహించారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేశారు.