లద్ధాక్‌లో ఇస్రో ప్రాజెక్ట్
అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఫీల్డ్ టెస్టులను లద్ధాక్‌లో చేయాలని నిర్ణయం తీసుకుంది ఇస్రో. గగన్‌యాన్, సముద్రయాన్ వంటి ఇతర స్పేస్ ప్రాజెక్టుల కోసం లద్ధాక్‌లో ప్రత్యేకమైన పనిని మొదలుపెట్టింది. పలురకాల టెక్నాలజీలను పరీక్షించాలని అనలాగ్ మిషన్‌ను లద్ధాక్‌లోని లేహ్‌లో చేపడుతున్నాయి.
ఈ మిషన్ వల్ల స్పేస్ రేడియేషన్ అంచనా వేయవచ్చు.
వ్యోమగాములు ఒంటరిగా ఉండడం వల్ల వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించడం.
భూమి నుండి దూరంగా ప్రయాణం చేయడం వల్ల కమ్యూనికేషన్లు బలహీనపడడం వల్ల ఆ పరిస్థితులకు వ్యోమగాములను సిద్ధం చేయడం.
ఈ మిషన్ కోసం ఇస్రో, ఆకా స్పేస్ స్టూడియో, యూనివర్సిటీ ఆఫ్ లద్ధాక్, ఐఐటీ బాంబే వంటి సంస్థలు ఈ మిషన్ కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. చంద్రుని వంటి కఠిన భౌగోళిక పరిస్థితులున్న ప్రదేశం లద్ధాక్‌లో ఉండడంతో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడి పైకి మానవ సహిత యాత్రలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.