హెజ్బుల్లా చీఫ్‌ను చంపేసిన ఇజ్రాయెల్ ఆర్మీ
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరుట్‌పై జరిగిన దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఈరోజు తెలిపింది. శుక్రవారం రాత్రి నుండి 64 ఏళ్ల నస్రల్లాతో కమ్యూనికేషన్ లేదని హిజ్బుల్లా ధ్రువీకరించింది. “హసన్ నస్రల్లా చనిపోయాడు” అని మిలిటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని ఎక్స్‌లో ప్రకటించారు.
ఇజ్రాయెల్ తూర్పు, దక్షిణ లెబనాన్‌లోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా సైట్‌లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ జెట్‌లు దక్షిణ బీరుట్‌లోని హిజ్బుల్లా కోటలపై రాత్రిపూట బాంబులు వేస్తూ, దూకుడు పెంచుతున్నాయి. “హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేయలేరు” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. “ఇది ముగింపు కాదు. స్పష్టమైన సందేశం. ఇజ్రాయెల్ పౌరులను బెదిరించే ఎవరైనా, వారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుస్తుంది” అని లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి ఒక ప్రకటనలో తెలిపారు.
హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోకి రాకెట్లను ప్రయోగించడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ “అనాగరిక” దూకుడుకు వ్యతిరేకంగా లెబనాన్‌కు రక్షణగా హిజ్బుల్లా పేర్కొన్న ఫాడి-1 రాకెట్‌లను ఉపయోగించి కిబ్బట్జ్ కబ్రీని లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్‌లో పూర్తి అధికారాన్ని అనుభవిస్తున్న నస్రల్లా, షియా మద్దతుదారులలో, యుద్ధం చేయడానికి లేదంటే శాంతికి మధ్యవర్తిత్వం వహించే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 64 ఏళ్ల కుమార్తె జైనాబ్ దక్షిణ బీరుట్‌లోని హిజ్బుల్లా బలగాలను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడుల్లో ఒకదానిలో మరణించినట్లు ఇజ్రాయెల్ ఛానెల్ 12 నివేదించింది. అయితే హిజ్బుల్లా లేదా లెబనీస్ మీడియా నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. 2006లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత నస్రల్లా హతమైనట్లు పుకార్లు వచ్చాయి. అయితే, షియా నాయకుడు చాలా రోజుల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకే, ఇతర హిజ్బుల్లా సభ్యులు సైతం మరణించారు.

“హిజ్బుల్లా సెక్రటరీ జనరల్‌గా హసన్ నస్రల్లా 32 సంవత్సరాల పాలనలో, అనేక మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల హత్యకు, వేలాది ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక, అమలుకు నేతృత్వం వహించాడు” అని ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది. “ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పౌరులు హత్య, తీవ్రవాద దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామి అని ఇజ్రాయెల్ పేర్కొంది. ఉత్తర ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడి సైరన్లు వినిపించాయి

లెబనా సరిహద్దులో ప్రయోగించిన రాకెట్లతో యుద్ధం మరింత ముదిరేలా కన్పిస్తోంది. ఇజ్రాయెల్ సైనిక నివేదికల ప్రకారం, లెబనాన్ నుండి రెండు ఉపరితల-ఉపరితల క్షిపణులు ప్రయోగించగా, వాటిని ఆ దేశ సైన్యం అడ్డుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మందికి పైగా మరణించగా లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

