Breaking NewscrimeHome Page Slider

భార‌త్‌లోనే ఇస్లాం సేఫ్‌

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్​ ‘బుల్డోజర్ న్యాయాన్ని’ సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యేలా, వారి భాషలోనే సమాధానం ఇవ్వటం సరైనచర్య అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టిన 2017 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని సీఎం యోగి తెలిపారు. భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో లేదని, వారి ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ప్రమాదంలో ఉన్నాయని విమర్శించారు. హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమనే విషయం గుర్తించుకోవాలని సూచించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై యూపీ సీఎం ఆందోళన వ్యక్తంచేశారు.