Home Page SliderTelangana

ఇదేమీ ఆచారం.. హోలీ రోజు పిడిగుద్దులాట

తెలంగాణలోని కొన్ని గ్రామాలు హోలీ పండుగను పిడిగుద్దులాటతో జరుపుకుంటాయి. అంటే.. హోలీ రోజున గ్రామస్తులు పిడికిలితో ఒకరినొకరు గుద్దుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీనిని “పిడిగుద్దులాట” అంటారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయో భేదం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు అభ్యంతరం తెలుపుతున్నా… తమ గ్రామ శ్రేయస్సు కోసం పిడిగుద్దులు తప్పవని గ్రామస్తులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామం, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామం వంటి కొన్ని గ్రామాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి.

ఈ ఆచారం చాలా కాలం నుండి కొనసాగుతోంది, మరియు పిడిగుద్దులాట ఆడకపోతే గ్రామానికి అరిష్టం వస్తుందని గ్రామస్తుల నమ్మకం. హోలీ రోజున గ్రామస్తులు సాయంత్రం సమయంలో పిడికిలితో గుద్దుకుంటారు, కొన్నిసార్లు రక్త గాయాలతో కూడా ఆడుతారట. కొంతమంది ఈ ఆచారాన్ని “రంగుపడుద్దీ” అని కూడా అంటారు. గతంలో పిడిగుద్దులాట చేయకపోతే ఊరులోని ట్యాంక్ కూలిపోయిందని స్థానికులు నమ్ముతారు. హోలీ పండుగ రోజు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.