Andhra PradeshBreaking NewsHome Page Slider

వ‌క్క‌పొడి అమ్మేవారి ద‌గ్గ‌ర అంత బంగార‌మా…!

ఒక్కో ప‌లుకుని …గెలుపు కోసం కీల‌క మ‌లుపుగా మార్చుకుని ఇంతింతై వ‌టుడింతైన చందాన ప్ర‌పంచ‌లో తెలుగు వారు ఎక్క‌డుంటే అక్క‌డ క్రేన్ వ‌క్క ప‌లుకులు ఉండేలా చేసిన వ్య‌క్తి దివంగ‌త గ్రంధి సుబ్బారావు.అయ‌న మ‌ర‌ణానంత‌రం ఆయ‌న సంస్థ‌లు తీవ్ర గంద‌ర‌గోళంగా మారిపోయాయి.తాజాగా క్రేన్ సంస్థ‌ల ఇల్లు,కార్యాల‌యాల్లో ఐటి సోదాలు నిర్వ‌హించాయి. గుంటూరులో క్రేన్ వక్కపొడి ఛైర్మన్ ఇళ్లలో నిర్వ‌హించిన ఐటీ తనిఖీల్లో క‌ళ్లు చెదిరే బంగారం ల‌భించింది.సంస్థ ఛైర్మన్ బంధువులు, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జ‌రిపితే….దాదాపు 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.15 లక్షలు ల‌భించిన‌ట్లు ఐటి అధికారులు వెల్ల‌డించారు.వాటిని సీజ్ చేశారు.ఇంకా సోదాలు జ‌రుపుతూనే ఉన్నారు.