Home Page SliderNationalNews Alertviral

కదిలే రైల్లో ఐఆర్‌సీటీసీ ఉద్యోగి నిర్వాకం..మండిపడ్డ నెటిజన్లు

భారతీయ రైల్వేలో ఉద్యోగుల పనితీరు కంచే చేను మేసిన చందంగా ఉంది.  క్యాటరింగ్, పరిశుభ్రత కోసం నియమించిన ఐఆర్‌సీటీసీ ఉద్యోగే రైల్లోని చెత్తను బాధ్యతారహితంగా కదులుతున్న రైల్లో నుండి బయటకు విసిరేశాడు. ఈ పనిపై అక్కడున్న ప్రయాణికులు వారించినా వినకుండా, ఆ డస్ట్‌బిన్‌లోని చెత్తనంతా విసిరేశాడు. పైగా మరి చెత్త ఎక్కడ వెయ్యాలి అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిపై, రైల్వేశాఖపై విమర్శలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. దీనితో ఉన్నతాధికారులు స్పందించి, చెత్త తీసే యంత్రాంగం ఉందని, విధుల్లో ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు.