Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

అసత్యాలు రాసేకంటే …ఇంత విషమిచ్చి చంపండి

తప్పుడు వార్తలతో తనను మానసికంగా చంపవద్దని, దానికి బదులు విషమిచ్చి చంపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి , మంత్రిని ఉద్దేశించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థలు ప్రసారం చేసిన కథనాలపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ అంశంపై శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ , మహిళా అధికారుల పట్ల అసభ్యకరంగా వార్తలు రాయడం దారుణమని మీడియా సోదరులు తమ ఇంట్లోని ఆడబిడ్డల గురించి కూడా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. తన కుమారుడి మరణం తర్వాత సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నానని, ఇలాంటి నల్గొండ జిల్లా కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి నిర్ణయమని, దీనిపై డీజీపీతో విచారణకు ఆదేశించామని, 20 రోజుల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కథనాలు పూర్తిగా దురుద్దేశపూరితమైనవని, నిరాధారమైన ఆరోపణలతో మహిళా అ ఈ దుష్ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు . ఐఏఎస్ అధికారుల సంఘం కూడా రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేసింది.

ఐఏఎస్ అసోసియేషన్ ఆగ్రహం
తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారావు, కార్యదర్శి జయేష్ రంజన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా సాగుతున్న ఈ ‘వైరల్ కంటెంట్’పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.నిరాధారమైన వార్తల వల్ల నిబద్ధతతో పనిచేసే అధికారుల ఆత్మగౌరవం దెబ్బతింటోందని అసోసియేషన్ పేర్కొంది. ముఖ్యంగా మహిళా అధికారుల పోస్టింగ్స్ మరియు వ్యక్తిగత జీవితాలపై అసభ్యకర నెరేషన్ ఇవ్వడంపై మండిపడింది.ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రజల్లో అధికారులపై చులకన భావం ఏర్పడుతుందని, ఇది విధి నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.సోషల్ మీడియా , డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న అభ్యంతరకర వార్తలను వెంటనే తొలగించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.తప్పుడు వార్తలను సృష్టించే వారిపైనే కాకుండా, వాటిని షేర్ చేసే , వైరల్ చేసే వారిపై కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐఏఎస్ అసోసియేషన్ హెచ్చరించింది. న్యాయపోరాటం ద్వారా బాధ్యులను శిక్షించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది.