విరుష్క జోడికి ఫిదా అయిన ఇన్‌స్టా గ్రామ్
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విరుష్క జోడికి ఫ్యాన్స్‌లో ఉండే క్రేజ్ అంత ఇంత కాదు.ఈ నేపథ్యంలో విరుష్క జోడీ సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది కొన్ని సెకన్లలోనే వైరల్‌గా మారుతూ ఉంటుంది. కాగా విరుష్క జోడి నిన్న తమ వివాహ 6వ వార్షికోత్సవాన్ని ముంబైలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఓ బ్యూటీఫుల్ ఫోటోను విరాట్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ..”లవ్ ఇన్ఫినిటీ” అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. కాగా విరాట్ ఈ ఫోటోను షేర్ చేసిన కేవలం ఓ గంట వ్యవధిలోనే 30 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు గంట వ్యవధిలోనే మిలియన్స్‌లో లైక్స్ సాధించిన తొలి ఫోటోగా ఇది రికార్డు సృష్టించింది. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఆసియాలో గంట వ్యవధిలోనే 3 మిలియన్ లైక్స్ సాధించిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ రన్ మెషీనా మజాకా విరాట్ దెబ్బకి ఇన్ స్టా కూడా షేక్ అవ్వాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.