త్వరలో ఇందిరమ్మ ఇండ్లు
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అక్టోబర్ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 ఇళ్ల నుంచి 4 వేల ఇళ్ల వరకు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పింకు చొక్కాలు, మూడు రంగుల జెండాతో సంబంధం లేకుండా పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. మూసీ బెడ్ లో నివసించే వారికి మంచి జీవితం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నారని తెలిపారు. గత పదేళ్ళలో వాళ్ళు చేయలేని పనులు తాము చేస్తుంటే… బీఆర్ఎస్ చిల్లర వేషాలు వేస్తుందని విమర్శించారు.