బెల్లీ స్టెప్పులతో దుమ్ము రేపిన భారత ఆటగాళ్లు
సీనియర్లు లేకుండా జింబాబ్వేలో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేశారు భారత జట్టు. ఈ విజయాన్ని డ్యాన్స్ చేస్తూ టీమిండియా ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకున్నారు. `కాల చష్మా’ పాటకు జట్టు ఆటగాళ్లు స్టెప్పులు వేస్తున్న వీడియో… ఇప్పడు నెట్టింట్లో వైరల్ చేస్తుంది. ఇందులో ప్రధానంగా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ బెల్లీ స్టెప్పులతో ఇరగదీశాడు. ఇషాన్ చేసిన స్టెప్పులు చూసి, క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇషాన్ కిషన్ చేసిన స్టెప్పులను కాపీ చేసిన శుబ్‌మన్ గిల్.. సెంచరీ చేసిన కిక్‌తో మరింత జోష్‌లో రెచ్చిపోయాడు. గబ్బర్ శిఖర్ ధావన్ తన స్టయిల్‌లో మూమెంట్స్ చేశాడు. శిఖర్‌ధావన్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహార్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్ వంటి ప్లేయర్లు అందరూ డ్యాన్స్ చేశారు.

