డల్లాస్ షూటింగ్‌లో తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్య మృతి
మే 7వ తేదీ శనివారం మధ్యాహ్నం అలెన్ ఔట్‌లెట్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో అనుమానితుడితో సహా తొమ్మిది మంది మరణించారు. కాల్పుల ఘటనలో మరణించిన వారిలో పిల్లలు ఉన్నారన్నారు అమెరికా అధ్యక్షడు జోబైడెన్. డల్లాస్ అలెన్ అవుట్‌లెట్ ప్రీమియం మాల్ షూటింగ్‌లో తీవ్ర గాయాలపాలైన ఐశ్వర్య తాటికొండ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కాల్పుల ఘటన సమయంలో షాపింగ్ మాల్‌లో స్నేహితుడితో కలిసి ఉంది. ఆమె స్నేహితురాలు కూడా కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఐశ్వర్య మెకిన్నేలో నివస్తోంది. కుటుంబం ఇండియాలో ఉంటోంది.

ఐశ్వర్య, 2020లో USలో మాస్టర్స్ పూర్తి చేసింది. 2018లో ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాద్ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం ఆమె నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఆమె పార్థివ దేహాన్ని ఇండియాకు పంపించేందుకు తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాల్పులపై దర్యాప్తు చేస్తున్న టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, నిందితుడిని 33 ఏళ్ల మారిసియో గార్సియాగా గుర్తించారు. అమెరికాలో తుపాకీ హింసపై యుఎస్ చట్టసభలు ఏదైనా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న చర్చ మొదలైంది.