పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చర్లు అదరగొట్టారు. నేడు జరిగిన క్వాలిఫికేషన్ రౌండులో బోణీ సాధించి, క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. అంకిత భకత్ 666 పాయింట్లతో 11 వస్థానంలో నిలిచింది. భజన్ కౌర్ 658 పాయింట్లతో 22 వస్థానంలో, దీపికా కుమారి 658 పాయింట్లతో 23వ స్థానం సాధించారు. ఈ ముగ్గురూ గెలుపొందడంతో టీమ్ విభాగంలో 1983 పాయింట్లతో నాలుగవ స్థానం సాధించింది. 2046 పాయింట్లతో దక్షిణ కొరియా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాలలో చైనా 1996 పాయింట్లతో, మెక్సికో 1983 పాయింట్లతో ఉన్నాయి. ఈ విధంగా మొదటి నాలుగు స్థానాలలో ఉన్న జట్లు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటాయి.