ఆసీస్ పై భారత్ ఘనవిజయం
భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో మొదటిగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ కెఎల్. రాహుల్ , విస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రాహుల్ 57 , సూర్య 50 రన్స్ కొట్టడంతో భారత్ 20 ఓవర్లలో 186 రన్స్ చేసింది. రోహిత్ 15 , కోహ్లీ 19 పరుగులు మాత్రమే చేశారు. ఆశించిన స్థాయిలో కోహ్లీ, రోహిత్ పరుగులు తీయకపోవడంతో ఈ మ్యాచ్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదన్న అభిప్రాయం కలిగింది. ఆస్ట్రేలియా తరుపున బౌలర్లలో రిచర్డసన్ 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ గెలవాలంటే 187 రన్స్ చేయాల్సి ఉంది. అయితే భారత్ విధించిన 187 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ సాధించలేక పోయింది. 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్స్‌లో ఫించ్ 76 రన్స్ చేసి ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.