భారత్- పాక్ మరోసారి హోరాహోరి
మొన్న జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్-పాక్ హోరాహోరిగా తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే వీరి మధ్య యుద్ధం ముగిసిందనుకుంటే అది హాస్యమనే చెప్పాలి. ఎందుకంటే భారత్-పాక్ మధ్య మరోమారు మ్యాచ్ జరగనుంది. అవును మీరు విన్నది నిజమే మరో వారంలో మళ్లీ ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది. మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆసియా కప్‌లో పాకిస్థాన్ , హాంకాంగ్ జట్లు భారత్‌తో గ్రూప్ లో ఉన్నాయి. అలాగే మిగిలిన జట్లు గ్రూప్ లో ఉన్నాయి. ఈ రెండు గ్రూప్‌ల నుండి టాప్ 2లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 3న జరిగే సూపర్ 4లోకి స్థానం దక్కించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే భారత్-పాక్ మధ్య మరోసారి క్రికెట్ యుద్ధం జరిగే అవకాశం ఉంది.

