పాక్ పౌరులకు భారత్ కీలక ఆదేశాలు..
భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌరులు వీలైనంత తొందరలో దేశం విడిచి వెళ్లిపోవాలని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే లోగా అటారీ- వాఘా బార్డర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఇప్పటి వరకూ 926 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ నుండి వెళ్లగా, పాకిస్తాన్ నుండి భారత్‌కు 1814 మంది వచ్చారు. ఇప్పటికే ఇరు దేశాలు గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా దేశాలకు వెళ్లే పాక్ విమానాలు శ్రీలంక మీదుగా చుట్టుతిరిగి ప్రయాణం చేయవలసి ఉంటుంది. దీనివల్ల విమాన ప్రయాణ సమయం, ఛార్జీలు, ఇంధన ధరల పెంపు వంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోతున్నాయి.