NationalNews

హిమోగ్లోబిన్ పెంచుకోండి ఇలా..

హిమోగ్లోబిన్ భారతీయులలో చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలో చాలా ముఖ్యమైన సమస్య హిమోగ్లోబిన్ లోపమే. అయితే ఈ హిమోగ్లోబిన్ తక్కువగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హిమోగ్లోబిన్ సమస్య సాధారణంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది. కారణం ఐరన్ తక్కువగా ఉండటం. ఈ ఎనీమియా సమస్య రాకుండా ఉండాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే హిమోగ్లోబిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే హిమోగ్లోబిన్‌ను ఎలా పెంచుకోవాలి. అది ఏ విధంగా పెరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే వాళ్ళు కింద పేర్కొన్న ఆహార పదార్థాలను తమ డైట్ లో చేర్చుకోవాలి.

ఆకుకూరలు.. ముఖ్యంగా తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. తోట కూర గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఒంటికి సోడియం, పొటాషియం తో పాటు విటమిన్లను కూడా అందిస్తుంది. ఈ తోటకూర బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది. హై టెన్షన్ తో బాధపడుతున్న వారికి కూడా ఈ తోటకూర తీసుకుంటే మంచి ఫలితాలిస్తుంది.

ఖర్జూరం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.  వీటిని రోజూ తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుకోవచ్చు. ఇది వెంటనే బాడీకి ఎనర్జీని అందిస్తాయి. అలాగే ఖర్జూర పండ్లు మనిషి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఖర్జూరాల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం మరియు కాపర్ ఆస్టియోపోరోసిస్ సమస్యను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్ష కూడా హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అందులో విటమిన్-ఏ కూడా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఖర్జూరాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలాగే రోగ నిరోధకశక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన మలబద్దకం సమస్య కూడా తీరుతుంది.

మరొక ఆరోగ్య పదార్థము నువ్వులు. నువ్వులు కూడా హిమోగ్లోబిన్ పెంచుతాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్నీ నివారిస్తుంది. నువ్వుల్లో ఉండే మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. నువ్వుల లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ డి.. ఎర్రరక్త కణాల ఫంక్షన్ కి చాలా ముఖ్యం. నేరేడు, చింతపండు గుజ్జు, పల్లీలు తీసుకున్నా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు సూచించారు. మీ డేలీ డైట్ లో వీటిని తీసుకుంటే ఎనీమియా సమస్యను దూరం చేయొచ్చు. హిమోగ్లోబిన్ పెంచుకోండి. ఆరోగ్యంగా జీవించండి.