అసహనంతో షిండే సొంతూరుకు…
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరో తేలలేదు. కూటమి నేతల చర్చలు ఓ కొలిక్కి రాలేదు. గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో మహాయుతి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి ముంబయిలో కూటమి సభ్యుల సమావేశం జరగాల్సి ఉండగా సీఎం షిండే సైలెంట్‌గా తన సొంతూరు సతారాకు చెక్కేశారు. ఈ భేటీ గురించి ఏ విషయం వెల్లడించలేదు. దీనితో ఆయన అసహనానికి లోనయ్యారని అందుకే సమావేశాలు జరగడం లేదని సమాచారం. మరోపక్క శివసేన పార్టీ సమావేశాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. బీజేపీ అధిష్టానానికే నిర్ణయం వదిలేశామని చెప్పినా, ఇంకా వారు సీఎం పదవిపై ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం.