Breaking NewscrimeHome Page SliderNews Alert

గూగుల్ ని న‌మ్మి గోవా వెళ్తే…అడ‌విలో తేల్చేసింది

గూగుల్ త‌ల్లి…గూగుల్ త‌ల్లి అని న‌మ్మి గూగుల్ మ్యాప్స్ ని ఆధారంగా చేసుకుని ప్ర‌యాణాలు చేస్తే చివ‌ర‌కు ప్రాణాలు పోతాయ‌ని ఇటీవ‌ల కాలంలో రెండో సారి నిరూపిత‌మైంది.త‌ప్పుడు గూగుల్ మ్యాప్ వ‌ల్ల గ‌త వారం రోజుల కింద‌ట యూపిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీద కారులో ప్ర‌యాణిస్తూ అక్కడ నుంచి ప‌డి ముగ్గురు యువ‌కులు మృతి చెందిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే బీహార్‌కి చెందిన మ‌రో కుటుంబం ప్రాణాపాయ అంచుకుపోయి మ‌రీ బ‌తుకుజీవుడా అంటూ ఊపిపిపోసుకుంది. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడిపింది. బీహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు భీమ్‌గఢ్ వైల్‌లైఫ్ జోన్‌లో 7కి.మీ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో.. బయటపడే మార్గం లేక కారు లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే గడిపారు.దీంతో గూగుల్ మ్యాప్స్ అంటే బెంబేలెత్తిపోతున్నారు.