Home Page SliderTelangana

కేసీఆర్‌ను చూస్తే మా నాయన గుర్తుకొస్తాండు

దసరా పండగొస్తే మా అమ్మగారింటికి పోయేది. మా నాయన మంచిగా చూసుకొనేది. కొత్త బట్టలు తెచ్చేది. అవి కట్టుకుని బతుకమ్మ ఆడేది. ఇప్పుడు నాయన లేడు. మా తమ్ముడు దసరా పండక్కి చీరలు పెడతారు. ఆ రోజులు మాదిరి కేసీఆర్ అన్న కూడా దసరా పండక్కి చీర ఇస్తారు. ఆయన గెలిచిన కాడ నుండి సంది బతుకమ్మ చీరలొస్తున్నాయ్.

    ఓ బాపు తన పిల్లలను ఎట్లా చూసుకుంటారో.. ముఖ్యమంత్రి సార్ అట్లనే ఆడపిల్లలను మంచిగా చూసుకుంటున్నారు. ఆయన పాలన మహా సంబురంగా ఉంది. ఇప్పుడు దసరాకు పుట్టింటికి పోతే ఒక చీర వస్తోంది. సీఎం సారు ఇంకో చీర ఇస్తారు. దండెం మీద బతుకమ్మ కేసీఆర్ అన్న ఇచ్చిన చీర చూస్తానే.. మా తండ్రి గుర్తుకొస్తారు. మళ్లీ కేసీఆర్ గెలవాలి.