Home Page SliderNational

నెహ్రూ ఇంటి పేరు అక్కర్లేదా? గాంధీ కుటుంబంపై మోదీ ఎదురుదాడి

Share with

రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
నెహ్రూ గురించి గొప్పలు చెప్తారు? ఇంటి పేరు వాడుకోరా?

కాంగ్రెస్ పార్టీపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కొత్త విమర్శలు గుప్పించారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వారిలో ఎవరూ “నెహ్రూ” పేరును ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎప్పుడైనా నెహ్రూ ప్రస్తావన తేకుంటే కాంగ్రెస్ నేతలు కలత చెందుతారన్నారు. నెహ్రూ అంత గొప్ప వ్యక్తి అయితే, వారెవరూ నెహ్రూ ఇంటిపేరును ఎందుకు ఉపయోగించరు, నెహ్రూ పేరును ఉపయోగిస్తే వచ్చే ఇబ్బందేంటని కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు రాజ్యసభలో సమాధానమిచ్చారు.

ఈ దేశం ఏ కుటుంబానికీ ఆస్తి కాదన్నారు మోదీ. జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ముత్తాత అన్నారు. అదానీ వ్యవహారంపై విచారించాలంటూ మోదీ మాట్లాడుతున్న సమయంలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. బీజేపీని విమర్శించేందుకు సొంత సమస్యలను కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చుకుంటుందన్నారు. “మేము రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తున్నామని వారు చెప్పారు, కానీ వారు ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను 90 సార్లు పడగొట్టారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి ఆర్టికల్ 356 యాభై సార్లు ఉపయోగించారు. అది ఇందిరా గాంధీ” అని ప్రధాని అన్నారు.

అదానీ గ్రూప్‌పై తనను లక్ష్యంగా చేసుకుని విపక్షాల నినాదాలకు స్పష్టమైన ప్రతిస్పందనగా, “మీరు మాపై ఎంత బురద చల్లినా కమలం వికసిస్తూనే ఉందన్నారు మోదీ. కొంతమంది సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు దేశాన్ని నిరాశకు గురిచేస్తున్నాయన్నారు. అలాంటి వారికి నేను చెబుతాను – జిత్నా కీచద్ ఉచ్చలోగే, కమల్ ఉత్నా హీ ఖిలేగా (మీరు మాపై ఎంత బురద చల్లితే, కమలం మరింత వికసిస్తుంది). కమల వికాసానికి సహకరిస్తున్న ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. అదానీ గ్రూప్‌కు సంబంధించిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సభ మధ్యలో నిర సన తెలిపారు.