స్విగ్గీలో బిర్యానీ అర్డర్ చేస్తే బొద్దింక ప్రత్యక్షం
తిరుపతి బస్తాండ్ సమీపంలోని ఓ హోటల్ లో బిర్యాని ఆర్డర్ చేసిన కస్టమర్ కి గుండె జారినంత పనైంది.ఆవురావురుమంటూ బిర్యాని కోసం ఎదురు చూస్తూ తీరా ప్యాకెట్ ఓపెన్ చేయగానే అందులో బొద్దింక కనిపించడంతో ఖంగుతిన్నాడు. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఎంచక్కా నేరుగా డోల్ డెలివరీ చేస్తారని,పైగా వెంటనే తెస్తారని ఆశగా ఎదురు చూసిన కస్టమర్‌కి ఈ ఘటన తీవ్ర అసహనాన్ని తెప్పించింది.వెంటనే ఆయన హోటల్ యజమానికి,మీడియాకి ఫోన్ చేసి చెప్పడంతో ఇప్పుడు స్విగ్గి పరిస్థితి తిరుపతి బస్టాండ్ అయ్యిందని సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు.

