ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ, నాన్నను చంపేస్తా
హైద్రాబాద్ లోని ఓ యువకుడు ప్రేమ పేరుతో సైకోలా మారాడు. తొలుత ఇన్స్టాలో పరిచయమై ఫ్రెండ్ గా ఉంటాను అంటూనే ప్రేమ పేరుతో ఇంటి చుట్టూ తిరిగాడు.చెరుకుపల్లి విజయ్ అనే యువకుడుతో హయత్ నగర్ కి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని కి ఇన్స్టా పరిచయం ఏర్పడింది.ఇద్దరు సరదాగా కలిసి తిరిగారు. ఫోటోలు ,వీడియోలు కూడా షేర్ చేసుకున్నారు. వాటిని ఆసరాగా చేసుకుని ఆ యువతిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఇప్పుడా యువతి విజయ్‌ని తిరస్కరించింది.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు…. యువతి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చి నానా బీభత్సం చేశాడు.తనని ప్రేమించకపోయినా,తనతో తిరగకపోయినా ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తానని, మీ అమ్మా నాన్న లను చంపేస్తానని బెదిరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనతో తన కుటుంబీకులకు సైకో విజయ్ నుంచి ప్రాణ హాని ఉందని కంప్లెయింట్ చేసింది.ఇతనిపై గతంలో నాగార్జున సాగర్ లో నూ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

