న్యాయం లభించకపోతే, కత్తి తీయాల్సిందేనా!? సిద్ధార్ధ్ లూద్రా
అన్నీ ప్రయత్నించినప్పుడు, ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు, కత్తి తీయడం సరైనది. అప్పుడు పోరాడటం సరైనది. మేఘల్ చక్రవర్తి ఔరంగజేబు కోసం, గురు గోవింద్ సింగ్‌జీ రాసిన జాఫరానామా అంటూ ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసును వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్ధ్ లుద్రా. ఇన్ ద సర్వీస్ ఆఫ్ గురు గోవింద్ సింగ్ జీ ప్రవచించిన విషయాన్ని ఇప్పుడు తాజాగా లూద్రా వ్యక్తం చేయడం వెనుక మతలబేంటని నిపుణలు తలలుపట్టుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న లూద్రాకు ప్రస్తుతం పరిణామాలు గట్టి షాక్ ఇస్తున్నాయి. వాస్తవానికి సిద్ధార్ధ్ లూద్రా ఈ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబు రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టులో ఇప్పటి వరకు వాదించిన లుద్రా, ప్రస్తుతం సీఐడీని కట్టడి చేసేలా హైకోర్టులో వాదిస్తున్నారు. కేసు విచారణకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలన్నదానిపై ఆయన చంద్రబాబుతోనే భేటీ అయ్యారు. మొత్తంగా లూద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
https://x.com/Luthra_Sidharth/status/1701846102142501007?s=20