కక్ష సాధింపు చేస్తే….పోతారు!
కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరోక్షంగా చురకలంటించారు.రివెంజ్ రాజకీయాలకు పాల్పడితే నేలకూలక తప్పదని హెచ్చరించారు.అలాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఎవరు చేసినా వారు పదవులు పోయాక బాధ పడక తప్పదని హితవు పలికారు.ప్రస్తుతం తెలంగాణలో కక్ష రాజకీయలు నడుస్తున్నాయని వాటికి తాను సుతారమూ వ్యతిరేకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఏనాడూ ఈ తరహా రాజకీయాలు చేయలేదు

