Home Page SliderTelangana

“తెలంగాణా ఏర్పాటు చేసింది ప్రజల కోసం..దొరల కోసం కాదు”:రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతకొన్ని రోజుల నుంచి తెలంగాణాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  రాష్ట్రంలో ప్రజల తెలంగాణా కోరుకుంటే..దొరల తెలంగాణా వచ్చిందన్నారు.ఈ ఎలక్షన్ దొరల తెలంగాణా,ప్రజల తెలంగాణా మధ్య జరగబోతుందన్నారు.ప్రజల కోసం తెలంగాణా ఏర్పాటు చేశామని..దొరల కోసం కాదని రాహుల్ వెల్లడించారు. రాష్ట్రంలో దోపిడీ సొమ్ము అంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తుందని రాహుల్ ఆరోపించారు. కాగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పసుపు మద్దతు ధర రూ.15,000/- పెంచుతామన్నారు.అంతేకాకుండా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులగణన చేపడతామని రాహుల్ తెలిపారు.కాగా కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిదని రాహుల్ వివరించారు. బీజేపీ నా పదవిని లాక్కుంది. నా ఇల్లును కూడా లాక్కుంది. నాకు ఇళ్లు లేకపోయినా.. ప్రజల గుండెల్లో చోటు ఉంటే చాలు అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.