ఇక జగన్మోహన్ రెడ్డికి యుద్ధం చూపిస్తా-పవన్ కల్యాణ్
సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌కు ఇక యుద్ధమేనన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో యువతను, రైతులను, మహిళలను, ప్రభుత్వ ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడన్నారు పవన్. జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. జనసేన-టీడీపీ జెండా సభకు వచ్చిన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. రాజకీయ ఉద్ధండులు చంద్రబాబు కృషిని పవన్ కొనియాడారు. 2024లో పొత్తు విజయానికి స్ఫూర్తి కోసమే జెండా సభ అని పేరు పెట్టామన్నారు. జగన్ నీకు యుద్ధాన్నిస్తానన్నారు పవన్ కల్యాణ్.. జగన్ నీ బతుకంతా తెలుసు.. హైదరాబాద్ లో ఏ హోటల్లో ఏం చేశావో అన్నీ తెలుసునన్నారు. నోరు విప్పితే తట్టుకోలేవన్నారు పవన్ కల్యాణ్.

తన నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవని, రాష్ట్ర పరంగా, దేశపరంగా ఉంటాయన్నారు పవన్ కల్యాణ్. వ్యక్తి ప్రయోజనాలు తనకు పట్టవన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పొత్తులు పెట్టుకున్నామన్నారు. సంఘర్షణ, సహకారం ఇవ్వాల్సిన రెండు పరిస్థితులున్నాయన్నారు. 2024కి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. సహకరించుకుంటేనే.. ఐదు కోట్ల ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్ బంగారంగా ఉంటుందన్నారు. మనలో మనలో కలహించుకుంటే.. జగన్ తిరిగి గెలుస్తాడని.. తగ్గించుకొని మరీ ప్రజలను గెలిపించేందుకు జనసేన నడంకట్టిందన్నారు. పాతిక కేజీల బియ్యం, పదివేలు మీ చేతిలో పెట్టడం కోసం కాదు.. లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తానన్నారు పవన్ కల్యాణ్. డబ్బులు సంపాదించే మార్గం తన అన్న చూపించారని… పనిచేసే మార్గం చూపిస్తామన్నారు. డబ్బులుండాలి, భవిష్యత్ ఉండాలి. సంపాదించుకునే మార్గాలుండాలని చెప్పారు. చంద్రబాబు నవనగరాన్ని నిర్మించిన వ్యక్తి అని కొనియాడారు పవన్ కల్యాణ్. చంద్రబాబు అభివృద్ధి కోసమే తాము టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.

వచ్చే 45 రోజుల్లో వైసీపీ క్రిమినల్స్ కు జెండా సభ నుంచి పవన్ కల్యాణ్ హెచ్చరికలు పంపించారు. జనసేన నాయుకులపైగానీ, టీడీపీ నాయకులపైగానీ, సామాన్య ప్రజలపై వైసీపీ గూండాలు దాడి చేస్తే, బెదిరిస్తే.. మక్కెలిరక్కొట్టిమడత మంచంపై పడేస్తానన్నారు. ఐదుగురు వ్యక్తులు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు. పంచాయితీలన్నీ ఐదుగురు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వనరులపై మిగతా వారెవరికీ హక్కు లేకుండా పోయిందన్నారు. ఎంత కావాలి. ఎంతివ్వాలన్నది వారు చెప్తారన్నారు. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మందిని బలిపెడుతున్నారన్నారు.

