Home Page SliderNationalPolitics

‘నేను నిజం చెప్పడానికే వచ్చాను’..రేవంత్ రెడ్డి

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలపై బీజేపీ విషప్రచారం చేస్తోందన్నారు. అందుకే నిజాలు చెప్పడానికే తాను మహారాష్ట్ర వచ్చానని పేర్కొన్నారు. ఆఖరికి ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ గ్యారెంటీలపై అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయన్నారు. మేము తెలంగాణలో రైతులకు ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ హామీని చాలా వరకూ నెరవేర్చాం. ఇచ్చినమాట ప్రకారం 25 రోజుల్లో 22 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశాం అని చెప్పారు. దీనితో ప్రధాని తాను పెట్టిన ట్వీట్‌ను తానే డిలీట్ చేశారని చెప్పారు. ఇతర గ్యారెంటీలు కూడా చక్కగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్రకు రావలసిన ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలించుకుపోయారని, మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికలలో ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.