నవీన్ యాదవ్ అనే నేను
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ సమక్షంలో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత నవీన్ యాదవ్ స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్‌కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు పాల్గొన్నారు.

