ఎమ్మెల్యేల ఆస్తులనూ వదలని హైడ్రా
హైద్రాబాద్‌లోని చింతల్ బస్తీలో షాదాన్ కళాశాల ఎదురుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బంధువులకు చెందిన అక్రమ కట్టడాలపై బుధవారం హైడ్రా ఉక్కుపాదం మోపింది.ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా అక్రమ నిర్మాణాలను హైడ్రాతో నేలకూల్చారు.విషయం తెలుసుకుని కూల్చివేతల ప్రాంతానికి వచ్చేలోపే సర్వం నేలమట్టం చేసేశారు.దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.అధికారులపై మండిపడ్డారు.మీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు.ఎక్కడ నుంచో వచ్చి తమపై పెత్తనం చెలాయించాలని చూస్తారా అంటూ ధ్వజమెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నుంచి వచ్చే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని కోరారు.దీంతో అధికారులు సందిగ్దంలో పడ్డారు.