గృహ ప్రవేశం చేసిన విధ్వంసకారిణి(హైడ్రా)
అక్రమ కట్టడాల విధ్వంసకారిణి హైడ్రా బుధవారం గృహ ప్రవేశం చేసింది. హైడ్రా బాహుబలి,కేజిఎఫ్ జెసిబి,మంగోలియన్ ప్రొక్లెయినర్స్‌తో లాంఛనంగా ఓ ఇంటిది అయిపోయింది.అదేనండి రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ అన్నమాట.అవును..హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను బుధవారం ఏర్పాటు చేశారు.హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటయ్యింది. స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని నియమించారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

