నాగారంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు
హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు.మున్సిపల్,పోరంబోకు,ఆర్ అండ్ బి, ఇలా కబ్జాకి కాదేదీ అనర్హం అన్నట్లు ఇన్నాళ్లు ఆక్రమణలు చేసి అడ్డగోలుగా బిల్డింగ్‌లు కట్టిన వారిపై రేవంత్ సర్కార్ కొరడా ఝుళిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాగారంలో చాలా నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసింది.కొద్ది గ్యాపిచ్చి మళ్లీ ప్రారంభించారు.బుధవారం నుంచి నాగారంలో హైడ్రా కూల్చివేతలను పున్ఃప్రారంభించారు. ఏకంగా రోడ్డు స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్ కట్టి అద్దెలకు ఇచ్చిన బిల్డర్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.సదరు వ్యక్తి బిల్డింగ్ ని కూల్చివేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో హైడ్రా అంటే ఆక్రమణదారులు భయపడిపోతున్నారు.