హైడ్రా కొరడా..ఆరుగురు అధికారులపై కేసులు
హైదరాబాద్ అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా కొరడా ఝలిపిస్తోంది. చెరువులలో అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారులపై చర్యలకు సిద్ధమయ్యింది. ఆరుగురు అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో హైడ్రా ఫిర్యాదు చేసింది. నిజాంపేట, బాచుపల్లి, చందాపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హెచ్‌ఎండీఏ అధికారులపై ఈ కేసులు నమోదయ్యాయి.
నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందాపేట GHMC డిప్యూటీ కమిషనర్, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్- మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరక్టర్, HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, HMDA సిటీ ప్లానర్‌లపై ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

