ఇన్నోవేషన్‌లో బెంగళూర్, చెన్నైలను మించిపోయిన హైదరాబాద్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారిపోయిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఅర్ వ్యాఖ్యానించారు. బెంగళూర్, చెన్నైలను దాటి శరవేగంగా సెమి కండక్టర్ల విభాగంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ డిజైన్, డెవలప్‌మెంట్ ఫెసిలిటీని సోమవారం ప్రారంభించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ దేశానికి లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా ఉందని, వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్‌క్వార్టర్స్ ఇక్కడే ఉందన్నారు. నాస్కామ్ లెక్కల ప్రకారం దేశంలోని మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే లభిస్తున్నాయని, కేటీఅర్ తెలియజేశారు.