హైద్రాబాద్ మద్యం దుకాణాలు బంద్
హోళీ పండుగ సందర్భంగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ పాటించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్నీ వర్గాల ప్రజలు…కులమతాలకు అతీతంగా జరుపుకునే హోళీ నాడు మద్యం దుకాణాలు తెరిస్తే పండుగ వాతావరణం దెబ్బతింటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు.ఈ విషయంలో దుకాణాల యజమానులు,బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు సహకరించాలని కోరారు.నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.