‘వందేభారత్ రైళ్ల’ తయారీకి పోటీలో హైదరాబాద్ కంపెనీ
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందేభారత్ రైళ్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్టుకు 30 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుకు టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టు కింద 100 వందేభారత్ రైళ్లను తయారుచేసి, 35 ఏళ్ల పాటు నిర్వహించాలి. ఈ రైళ్లను అల్యూమినియంతో రూపొంది, తేలికగా ఉండి, అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఈ రైళ్లను సోనీపేట్‌లో తయారుచేస్తారు. ఈ ప్రాజెక్టుకు రెండు బిడ్లు దాఖలయ్యాయి. ఆ రెంటిలో హైదరాబాద్‌కు చెందిన ‘మేధా సర్వో డ్రైవ్స్’ కూడా ఒకటి. ఈ కంపెనీ స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌తో కలిసి బిడ్ దాఖలు చేసింది. మరొకటి ఫ్రాన్స్‌కు చెందిన రైల్వే దిగ్గజం అల్‌స్తోమ్. ఈ రెండు కంపెనీలలో దేనికి ఈ ప్రాజెక్టు దక్కుతుందో వేచి చూడాల్సిందే.