లింక్డిన్ టాప్ కంపెనీల్లో హైదరాబాద్ స్టార్టప్స్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం ఉత్తమ స్టార్టప్ కంపెనీలకు నెలవుగా మారింది. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్ వర్క్ లింక్డిన్ హైదరాబాద్ లోని టాప్ స్టార్టప్ ల జాబితాను విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న కంపెనీల ఆధారంగా వార్షిక ర్యాంకింగ్ కేటాయించింది. ఈ జాబితాను ఉద్యోగుల కెరీర్ అభివృద్ధి, అగ్రశ్రేణి ప్రతిభావంతుల ఆకర్షణపై ప్రత్యేకమైన డేటా ఆధారంగా రూపొందించారు. లింక్డిన్ ఇండియా అధికారుల సలహా ప్రకారం ఉద్యోగార్థులు కేవలం పెద్ద కంపెనీల వైపే దృష్టి మళ్లించకుండా స్టార్టప్ ల విస్తరణను కూడా ట్రాక్ చేస్తూండాలి. వీటిని ఉద్యోగ బోర్డులలో చూడలేరు. రెండేళ్లలోనే 14 కొత్త సంస్థలు జాతీయ స్థాయికి ఎదిగాయని పేర్కొన్నారు. వాటి ఫండింగ్, ఉత్పత్తి, మార్కెట్ ను గమనించాలని పేర్కొన్నారు. అప్పుడే అధిక వృద్ధిగల స్టార్టప్ లలో మంచి స్థాయికి చేరుకోగలరని సూచిస్తున్నారు.
మొదటి స్థానంలో స్కైరూట్ ఏరోస్పేస్ ఉండగా, తర్వాత రీసైక్లింగ్ ఫ్లాట్ పామ్ రీసైకల్ ఉంది. టాప్ 10 జాబితాలో ఈ ఏడాది ఏడు సంస్థలు కొత్తగా ప్రవేశించాయి.
టాప్ 10 జాబితాలో హైదరాబాద్ కంపెనీలు :
1- స్కైరూట్ ఏరోస్పేస్
2- రీసైకిల్
3- స్వైప్
4- జెహ్ ఏరోస్పేస్
5- విజన్ లైఫ్ సైన్సెస్
6- క్రెడ్జెనిక్స్
7- ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్
8- భాంజు
9- లిక్విడ్నట్రో గేమ్స్
10- కో స్కూల్


 
							 
							