అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి…
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీరప్రాంతంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. గత మూడు రోజులుగా అలలు పెద్దఎత్తున ఎగిసి పడుతుండడంతో తీరానికి సమీపంలోని నివాసాల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. అలలు 20-40 అడుగుల ఎత్తులో వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంచురాలో ఈ అలల ధాటికి 10 మంది కొట్టుకుపోయారు కానీ, తిరిగి వారిని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు కాపాడారు. ఈ సందర్భంగా సముద్రంలోకి దిగి సాహసాలు చేయవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.