Home Page SliderNational

మేలుకో వినియోగదారుడా.. కొత్త రూల్స్ తెలుసుకోండి

Share with

వినియోగదారుల చైతన్యం కోసం మేలుకో వినియోగదారుడా అనే నినాదంతో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వినియోగదారుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ వినియోగదారుల చట్టంలో ఈ కామర్స్ సంస్థలు కూడా చేరాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలలో కూడా ఏదైనా వస్తువు కొనుగోలు చేసి, వస్తు సేవలలో లోపాలు ఉంటే ఈ కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. రూ. 5 లక్షల వరకూ కోర్టు ఫీజులు కూడా చెల్లించనవసరం లేదు. చట్ట ప్రకారం  కేసు నమోదైన 120 రోజులలో తీర్పు వెలువడుతుంది. ఫోన్‌లో కూడా ఫిర్యాదును స్వీకరిస్తారు. రూ. 50 లక్షల వరకూ, జిల్లా స్థాయిలో, రూ. 2 కోట్ల వరకూ రాష్ట్రకమీషన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. అంతకు పైన విలువ గల కేసులను జాతీయస్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఆన్ లైన్‌లో కూడా http://edaakhi.nic.in/ అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వస్తువు కొనేటప్పుడు బిల్లు, రశీదులు, ఆన్‌లైన్ పేమెంట్ ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాలి. వీటిని సాక్ష్యాలుగా స్వీకరిస్తారు.