చత్తీస్ గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్
సుక్మా జిల్లాలో మావోయిస్టులకు ,భద్రతా దళాలకు మధ్య శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న పరస్పర ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమైనట్లు బస్తర్ ఐజి వెల్లడించారు.మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. చనిపోయిన మావోయిస్టుల నుంచి INSAS,AK-47,SLR ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని ఐజి వివరించారు. కొంటా,కిష్టారం ఏరియా మావోయిస్టుల కీలక సభ్యుల కోసం కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోలకు,భద్రతాదళాలకు మధ్య ఈ కాల్పులు జరిగిన నేపథ్యంలో 10 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.