Home Page SliderNational

లద్దాఖ్‌లో భారీగా బంగారం స్వాధీనం

భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన లద్ధాఖ్‌లో భారీగా బంగారం దొరికింది. దేశ సరిహద్దులలో ఇండో-టిబెటియన్ పోలీస్ బలగాలు గస్తీ తిరుగుతుండగా జూలై 9న 108 కిలోల బంగారం దొరికింది. ఇద్దరు చొరబాటుదారులు పట్టుబడ్డారు. వారివద్ద 108 కిలోల బరువు ఉన్న 108 బంగారు కడ్డీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. ఈ విషయం తాజాగా మీడియాకు తెలియజేసింది సైన్యం.