భారీ ఎన్‌కౌంటర్-10మంది మృతి
ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ కాల్పుల అనంతరం అక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.