Home Page SliderTelangana

భారీ పేలుడు- జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్

నల్గొండ జిల్లా చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ రహదారిపై  భారీ డీజిల్ ట్యాంకర్ లారీ డివైడర్‌ను భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ పేలి లారీ పూర్తిగా దగ్దమయ్యింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. ఈ సమయంలో లారీ నుండి బయటకు దూకి డ్రైవర్ ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీనితో ఈ దారిలో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.