హృతిక్ రోషన్ ఎంత పని చేశాడు..మా డబ్బు దండగయ్యింది
బాలీవుడ్ గ్రీకువీరుడు, చిన్నపిల్లల సూపర్ హీరో హృతిక్ రోషన్ అమెరికాలోని డల్లాస్‌లో అభిమానులను నిరాశపరిచారు. ఇటీవల జరిగిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో లక్షలు పెట్టి టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో హృతిక్ రోషన్ డ్యాన్స్ చేస్తారని, అభిమానులకు సెల్ఫీలు ఇస్తారని చెప్పి నిర్వాహకులు పెద్ద మొత్తంలో టిక్కెట్లు అమ్ముకున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడి హృతిక్‌తో సెల్ఫీ దిగాలని, డ్యాన్స్ చేయాలని ఆరాటపడిన అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి నిరాకరించారని, ఈవెంట్ చెత్తగా నిర్వహించారని మండిపడుతున్నారు అభిమానులు. తాను రూ.1.2 లక్షలు పెట్టి టిక్కెట్ కొన్నానని, హృతిక్ సెల్ఫీ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదని అభిమాని ఆరోపించారు. అమెరికాలోని వివిధ నగరాలలో ఏప్రిల్ 13 వరకూ హృతిక్ రోషన్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
Bollywood news: ‘ఫూలే’ సినిమాకు బ్రాహ్మణ సమాజం నుండి అడ్డంకులు.. ఏప్రిల్ 25న రిలీజ్..?