Home Page SliderTelangana

TSPSC కేసులో సిట్ విచారణ వివరాలు ఎలా లీకయ్యాయి- హైకోర్టు సూటి ప్రశ్న

ఈ రోజు హైకోర్టులో TSPSC కేసు విచారణ కొనసాగింది. ఇప్పటి వరకూ 17 మందిని ఈ కేసులో అరెస్టు చేశామన్నారు సిట్ అధికారులు. మరొక వ్యక్తి న్యూజిలాండ్‌లో ఉన్నాడని, తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. కొందరు మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి సిట్ విచారణ విషయాలు చెప్తున్నారని, మంత్రులకు సిట్ విచారణ వివరాలు ఎలా తెలిసాయని పిటిషనర్ తరపున లాయర్ అనుమానం వ్యక్తం చేశారు. దీనతో  TSPSC కేసులో సిట్ విచారణ వివరాలు మంత్రులకు ఎలా లీకయ్యాయని ప్రశ్నించింది హైకోర్టు. ఈ కేసులో విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు. కాగా తాజాగా ఈ కేసులో ఈడీ కూడా విచారణకు సిద్ధమవుతోందని సమాచారం.