విద్యార్ధులను ర్యాగింగ్ చేసిన హౌస్ సర్జన్‌కి రూ.25వేలు జరిమానా
మద్యం మత్తులో విద్యార్ధులను ర్యాగింగ్ చేసిన హౌస్ సర్జన్ ఎట్టకేలకు సస్పెండ్ అయ్యాడు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న జగదీష్ అనే వ్యక్తి కళాశాలకు మద్యం సేవించి రావడమే కాకుండా సెకండ్ ఇయర్ ఎంబిబిఎస్ విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తీవ్రంగా ర్యాగింగ్ చేశాడు.దీనికి సంబంధించి వీడియోలతో సహా విద్యార్ధులు ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేశారు.దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు …. జగదీష్‌ని సస్పెండ్ చేశారు.అంతే కాదు అతనికి రూ. 25వేలు జరిమానా కూడా విధించారు.

