ఘోరం..నలుగురు పిల్లలతో తల్లి ఆత్మహత్య..
గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో సుమ్రా గ్రామంలో దారుణ ఘటన జరిగింది. భానుబెన్ తోరియా(32) అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రిత్విక్(3), ఆనంది(4), అజు(8), ఆయుష్ (10) పిల్లలతో కలిసి, తల్లి మృతదేహాలు బావిలో తేలియాడడంతో గ్రామస్తులు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలో నుండి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఆత్మహత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Breaking news: వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?